వంతెన కూలి అయిదుగురి మృతి

65చూసినవారు
వంతెన కూలి అయిదుగురి మృతి
థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న పైవంతెన కూలి అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ ఇంజినీర్ సహా నలుగురు కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన నైరుతి బ్యాంకాక్‌లో జరిగింది. బ్యాంకాక్ నుంచి దక్షిణ థాయ్‌లాండ్‌ను అనుసంధానించే ప్రధాన రహదారిలో భాగంగా 5 కిలోమీటర్ల మేర 2022 నుంచి ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్