AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.