బొబ్బిలి: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

67చూసినవారు
బొబ్బిలి: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
బొబ్బిలిలో భారత విద్యార్థి ఫెడరేషన్ మండల అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రూ. 3,480 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, బొబ్బిలి మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, స్థానిక సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్