బొబ్బిలి: కబడ్డీ పోటీలలో ఐటీఐ విద్యార్థి స్టేట్ ఫస్ట్

54చూసినవారు
బొబ్బిలి: కబడ్డీ పోటీలలో ఐటీఐ విద్యార్థి స్టేట్ ఫస్ట్
ఇటీవల ఒంగోలులో నిర్వహించిన కబడ్డీ పోటీలలో బొబ్బిలి గవర్నమెంట్ ఐటీఐ విద్యార్థి అయిన మర్రి అరవింద్ కబడ్డీలో స్టేట్ ఫస్ట్ సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం బొబ్బిలి ఐటీఐ కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జివి రమణ సూపెరడెంట్ అప్పలకొండదేముడు, శేఖర్ యుగంధర్, మోహన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్