బొబ్బిలి: తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు

59చూసినవారు
సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో కూడా తిప్పలు తప్పడం లేదు. సంక్రాంతి, కనుమ ముగించుకుని గురువారం విధులు నిర్వహించుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వలస కూలీలు, ఉద్యోగస్తులు బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో బస్సులు లేకపోవడం వచ్చిన బస్సులు కూడా కిక్కిరిసిపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ బస్సులను వేరే ప్రాంతాలకు తరలించడంతో ఈ సమస్యలు తలెత్తాయని ప్రయాణికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్