బొబ్బిలి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి

77చూసినవారు
బొబ్బిలి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఉన్న తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ప్రజలు, కార్మికులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్