మెరకముడిదాం మండలం గర్భాం, బైరిపురం, పెద మంత్రిపేట తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక పంచాయతీ నిధులతో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాగా దశాబ్దాల కాలం నుండి ఈ రోడ్డు గుంతలమయమై, అస్తవ్యస్తంగా తయారు కావడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి నెలకొనేది. పాలకుల చొరవతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో స్థానికులతో పాటు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.