ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగ కోఆర్డినేటర్ కే కృష్ణ అన్నారు. బుధవారం చీపురుపల్లి మండలంలో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.