చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ , జడ్పీటీసీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీపీ పొట్నూరు ప్రమీల సన్యాసినాయుడు మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పిటీసీ సభ్యులు శీర అప్పలనాయుడు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.