బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామానికి చెందిన మైసమ్మ పోలమ్మ సింహాచలం దంపతులు తమకు జరిగిన అన్యాయాన్ని శుక్రవారం మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడును ఆశ్రయించారు. తాళ్లపూడి పేట గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకులాలకు చెందిన వారు తమను కులం పేరుతో దూషించడమే కాకుండా ఇళ్ల స్థలాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. గౌరి నాయుడు ద్వారా పోలీసులను ఆశ్రయించారు.