బొండపల్లి మండలంలో ఆర్జీఎస్ఏ కింద లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పై శిక్షణ తరగతులుగురువారం నిర్వహించారు. ఎంపీడీవో జి.గిరిబాల మాట్లాడుతూ 15 అంశాలపై పూర్తీ అవగాహన పెంపొందించుకొని, సర్పంచులు, సచివాలయ సిబ్బంది గ్రామాభివృద్ధికి వీటిని అమలు చేయాలని సూచించారు. శిక్షణ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.