గజపతినగరంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పురిటిపెంటలో జరిగిన కార్యక్రమంలో ఐద్వ జిల్లా ఉపాధ్యక్షురాలు రాకోటి హరికృష్ణ వేణి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.