గంట్యాడ మండలం మోకాలు పాడు గ్రామంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిర్వహణ కొరవవడంతో అధ్వాన్నంగా మారాయి. వీటిని సమర్థవంతంగా నిర్వహించి వాడుకలోకి తీసుకురావాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా మారిపోయాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని, వీటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.