గుర్ల మండలం గుజ్జంగివలస జడ్పీ హైస్కూల్లో సోమవారం నెల్లిమర్ల టిబి యూనిట్ సూపర్వైజర్ వీరస్వామి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పట్ల విద్యార్థులకు అవగాహన చేపట్టారు. క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటుగా నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే వైద్యులను సంప్రదించాలని కోరారు.