మెంటాడలోని మండలం కొండ లింగాలవలస గ్రామములో బుధవారం భూసమస్యలు పరిష్కారం చేయడం కొరకు ప్రభుత్వం భూ సదస్సులను ప్రవేశపెట్టిందని తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కొండ లింగాల వలస గ్రామంలో గ్రామ సర్పంచ్ పాడి వరహాలమ్మ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గజంగుడ్డి వలస, శీల వలస గ్రామాలకు చెందిన రైతులు తమ భూమి సమస్యలను పరిష్కరించాలని కోరారు.