మెంటాడ మండలం జయతి గ్రామంలో బుధవారం ఎంపీడీవో భానుమూర్తి తమ సిబ్బందితో పర్యటించారు. డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బుధవారం జయతి గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా గ్రామంలోని ప్రజలకు మందులు పంపిణీ చేశామన్నారు.