అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా అడ్రస్‌గా వైసీపీ పాలన నిలిచిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ విమర్శించారు. శుక్రవారం కురుపాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ సహా అన్ని అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు.