నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల్లో గిరిజన సమస్యలను ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం తెలిపారు. పార్వతీపురం - కొమరాడ ప్రధాన రహదారితో పాటు గిరి శిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణం పై చర్చిస్తానన్నారు. రోడ్లు లేక గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదని, నేటికీ చాలా గ్రామాల్లో డోలీ మోతలే శరణ్యం అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు.