నెల్లిమర్ల: ప్రతిరోజూ కొత్త ఓటర్లను చేర్పించాలి

68చూసినవారు
నెల్లిమర్ల: ప్రతిరోజూ కొత్త ఓటర్లను చేర్పించాలి
ప్రతి రోజూ కొత్త ఓటర్లను నమోదు చేయాలని తహశీల్దార్ సుదర్శన రావు చెప్పారు. నెల్లిమర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం బిఎస్ఓలకు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న నిర్వహించనున్న సమావేశానికి బిఎల్ఓలు రిజిస్టర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బిఎల్ఓలు విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. అలాగే మండలంలో అధిక వయస్సు గల ఓటర్లను ఎంపిక చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్