పూసపాటిరేగ: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి

64చూసినవారు
పూసపాటిరేగ: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి
పూసపాటిరేగ మండలానికి చెందిన ఓ యువకుడు బెంగుళూరులో రైలు ఢీకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుమిలి గ్రామానికి చెందిన చంద్రమౌళి (29) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆయన బెంగళూరులోని ప్లాట్ ఫామ్ పై నడిచి వెళుతున్న నేపథ్యంలో వెనక నుండి వస్తున్న రైలును గమనించకపోవడంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్