భామిని మండలంలో వరి పంట చేనులను రైతులు ఆదివారం కోతలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులను గమనించిన రైతులు ముందుగా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట చేనులను శరవేగంగా కోత కోయిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ మేరకు కోత కోసిన వరి పంట చేనులును రైతులు కల్లాల్లో కుప్పలుగా పెడుతున్నారు. కల్లాల్లో ధాన్యాన్ని రైతులు టార్పన్లుతో కప్పుతున్నారు.