పార్వతీపురం మన్యం జిల్లాలో కాఫీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పాచిపెంట మండలం శతాబి వద్ద కాఫీ క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రాథమిక రంగాల శాఖల ప్రగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. పొలం గట్లపై ఆదాయం సమకూరే అంతర పంటలు వేయాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.