వంగరలోని రహదారికి మోక్షం కలిగేది ఎప్పుడు అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అరసాడ సెంటర్ వద్ద వర్షం కురిస్తే రోడ్డుపైనే వర్షపు నీరు నిలువ ఉండి ప్రయాణికులు, షాపుల వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు పోయేందుకు సరైన మార్గం లేక వర్షపు నీరు కొన్ని రోజులు రోడ్డుపైనే నిల్వ ఉంటుంది. రాజాం, వంగర ప్రధాన రహదారి అయిన ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే బస్సులు, ఆటోలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.