ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పి. జి. ఆర్. ఎస్)అందిన అర్జీలు స్థానికంగానే పరిష్కారం కావాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు, గృహ నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల స్థాయిలో పి. జి. ఆర్. ఎస్ విధిగా నిర్వహించాలన్నారు.