సాలూరు: ఘాట్ రోడ్డులో ప్రమాదం

72చూసినవారు
సాలూరు: ఘాట్ రోడ్డులో ప్రమాదం
పాచిపెంట మండలంలోని సోమవారం ఆంధ్ర, ఒడిశా ఘాట్ రహదారిలో లారీలు ఢీకొనడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశా నుంచి సాలూరు వైపు వస్తున్న లారీ టైరు పేలడంతో నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వేరొక లారీ అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఉదయం 10 నుంచి 11 మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హెచ్సీలు కృపారావు, సమర్పణరావు చేరుకొని పొక్లెయిన్ సాయంతో ట్రాఫిక్ పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్