సాలూరు: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

60చూసినవారు
సాలూరు: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదు నెలలగా చెల్లించాల్సిన బకాయులను వెంటనే చెల్లించాలని సీఐటీయు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం పాచిపెంట మండలం కర్రివలస స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులు బి. రాములమ్మ, సరస్వతి, సింహాచలంతో కలిసి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వారికి చెల్లించాల్సిన రూ. 3వేలు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్