ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం ఎల్ కోట మండలం జమ్మాదేవిపేట లో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈనెల 20 నుండి 31 వరకు గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం అని ఆమె కొనియాడారు. మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.