ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంగళవారం శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. కాగా ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మండలి చైర్మన్ గతంలో ఉత్తర్వులు జారీ చేయడంతో రఘురాజు అనర్హత వేటును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. ఈ మేరకు అనర్హత వేటు చెల్లదని కోర్టు తీర్పు నేపథ్యంలో మండలి చైర్మన్ అనర్హత వేటును రద్దు చేశారు. ఈ మేరకు రఘురాజు మండలి సమావేశాలకు హాజరయ్యారు.