ఎస్ కోట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ

68చూసినవారు
ఎస్ కోట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ
ఎస్ కోట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆయన స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో సమస్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్య అయిన గంజాయి అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్