విజయనగరం సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఉత్సవాలు, అమ్మవారి సిరిమానోత్సవంతో ముడిపడిన పలు వేదికలను ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ముందుగా పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.