విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురం నుండి వస్తున్న స్కూటీ, మెరకముడిదాం నుండి వస్తున్న బైక్ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా మరో వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.