విజయనగరం: శిక్షణా శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ డిఈఓ

67చూసినవారు
విజయనగరం: శిక్షణా శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ డిఈఓ
విజయనగరం స్థానిక పూల్ బాగ్ కాలనీ వద్ద గల భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో బుధవారం జరిగిన పురుష మరియు మహిళా ఉపాధ్యాయుల స్కౌట్స్ అండ్ గైడ్స్ బేసిక్ కోర్స్ శిక్షణా శిబిరాన్ని డిప్యూటీ డిఈఓ కెవి రమణ సందర్శించారు. ఉమ్మడి జిల్లాలో గల పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 58 మంది పురుష, మహిళా ఉపాధ్యాయులు ఈ శిక్షణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈనెల 24 తో ముగుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్