AP: పాస్టర్ ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హత్యపై ఎందుకు హైరానా పడుతోందని వెల్లడించారు. ప్రవీణ్‌ది యాక్సిడెంట్ గా చూపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రవీణ్‌కి సమబంధించి సీసీ ఫుటేజీ 11.42 గంటల వరకు చూపెడుతున్నారని.. దాని తర్వాత ఫుటేజీ ఏమైందని ప్రశ్నించారు. అసలు సీసీ ఫుటేజీలో బండి మీద కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్ కాదని అన్నారు.