ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏపీ ప్రగతి పైన, పారదర్శక పాలన విధానాలతో ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నారు. ప్రతిరోజు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ పురోగతి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో గ్రామాలలో రహదారుల నిర్మాణానికి అవసరమైతే మరింత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుదామని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందని విమర్శించారు.