54లక్షల కుటుంబాలకు మేలు చేసిన పవన్

1914చూసినవారు
54లక్షల కుటుంబాలకు మేలు చేసిన పవన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడిత పీడిత వర్గ ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు. కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్