AP: ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.25 వేల కోట్ల వరకు బకాయిలు ఉండగా, ఈ నెలాఖరు నాటికి రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు, కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఉద్యోగులకు జీపీఎఫ్, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాల్సి ఉంది. దీనిపై సీఎంకు అభ్యర్థన పెట్టగా, విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.