మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ ఏఎస్‌ఐ అధికారి మరణించాడు. స్థానిక మీడియా సమాచారం మేరకు..కొన్ని నెలల క్రితం అశోక్ అనే గిరిజనుడిని చంపాడనే అనుమానంతో కోల్ గిరిజన మూక సన్నీ ద్వివేది అనే వ్యక్తిని అపహరించి చంపారు. కాపాడటానికి వెళ్లిన ఏఎస్‌ఐను హత్య చేశారు.