TG: వరంగల్‌కు ఎయిర్‌పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 'చెప్పిన మాట ప్రకారం వరంగల్‌కు ఎయిర్‌పోర్టును సాధించాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను చేసి చూపించాం. హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం' అని పేర్కొన్నారు.