TG: అసెంబ్లీలో కేసీఆర్ పాపాల చిట్టా మొత్తం బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనకు మనమే బాగు చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దివిసీమ తుఫానులో సర్వం కోల్పోయినవాళ్లలా కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.