ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్: మంత్రి కొండపల్లి

53చూసినవారు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్: మంత్రి కొండపల్లి
AP: ఎన్నికల హామీల్లో భాగం 50 ఏళ్లు నిండి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కాగా, ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసీ గిరిజనులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నారు. 50-59 ఏళ్ల మధ్య పింఛన్ పొందుతున్న వారు 12,09,332 మంది ఉన్నారు. అన్ని వర్గాలను కలిపి మొత్తంగా 63.20 లక్షల మంది ప్రస్తుతం పింఛన్ పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్