పోలవరం పర్యటనకు మరోసారి సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఈ నెల రెండో వారంలో ఈ పర్యటన ఉంటుందని.. నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారని వెల్లడించారు. ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరంపై సీఎం నేడు రివ్యూ నిర్వహించారని చెప్పారు. త్వరలో పోలవరం పునరావాస పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.