మహారాష్ట్రలోని నైగావ్‌లో మరుగుదొడ్డిలో ఆడ కుక్కపై వృద్ధుడు జంతుహింసకు పాల్పడిన షాకింగ్ సంఘటన జరిగింది. ఒక మహిళా జంతు కార్యకర్త.. నిర్మాణ స్థలంలోని టాయిలెట్‌లో అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనను ఆమె తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి అమాయక జంతువుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.