మెదక్ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. మెదక్ మండలం పేరూర్ గ్రామంలోని బాస్కో స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తూ ప్రమాదానికి గురైంది. స్కూల్ బస్సును ట్రాలీ ఢీకొనడంతో రెండు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. ట్రాలీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.