పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024-25లో రూ.6,000 కోట్లు, 2025-26లో రూ.6,000 కోట్లు వస్తాయన్నారు. ప్రాజెక్టును 2027, మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ రూపొందించామన్నారు. 'గతంలో వైఎస్ఆర్ చర్యల వల్ల పోలవరం పనులు ముందుకు సాగలేదు. 2014లో ఏడు మండలాల విలీనం వల్లే పనులు ముందుకెళ్లాయి' అని ప్రెస్మీట్లో తెలిపారు.