ఏపీలోని నెల్లూరు జిల్లా జమ్మిపాలెంలో పెన్నా నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరుగురిని పోలీసులు కాపాడారు. సోమశిల జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా పెన్నా నది ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఆరుగురు పశువుల కాపర్లు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. కాగా, పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి ప్రవాహంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.