దొనకొండ మండలం బాధాపురం ఎస్సీ కాలనీలోని ప్రజలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో బోరు, ట్యాంకర్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు ఉపయోగపడలేదు. 45 కుటుంబాలకు ఒకే చేతిపంపు ఆధారమైంది. సాగర్ నీళ్లు 15 రోజులు నుంచి రాకపోవడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. సరైన రోడ్డు, వసతుల మించిన సమస్యలపై అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.