మార్కాపురం: కిరాణా దుకాణం యజమాని నిజాయితీ

63చూసినవారు
మార్కాపురం: కిరాణా దుకాణం యజమాని నిజాయితీ
మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కిరాణా షాప్ యజమాని మహేష్ నిజాయితీని స్థానికులు అభినందిస్తున్నారు. బుధవారం జయరావు అనే వ్యక్తి వారి దుకాణంలో సరుకులు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే తన బంగారు ఉంగరం పోగొట్టుకున్నాడు. అయితే దుకాణంలో ఉంగరాన్ని గుర్తించిన మహేష్ ఉంగరాన్ని జయరావుకు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. దీంతో పలువురు ఆయన్ని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్