గిద్దలూరులోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని రాచర్ల మండల విద్యా కమిటీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తులు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.