పొగాకు రహిత సమాజమే ఆరోగ్య హేతువనీ, పొగాకు అత్యంత ప్రమాదకరమైనదని, పొగాకు రహిత ప్రాంతాలుగా వుండేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రధానోపాధ్యాయురాలు ఆకవీటి. సరోజ అన్నారు. బుధవారం మండలంలోని హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో పొగాకు వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించి అవగాహన కలిగించారు. పొగాకు వలన కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.