కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో ఎస్ఎస్సి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి క్రికెట్ పోటీలను కనిగిరి సీఐ ఖాజావలి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో కలిసి సరదాగా ఆయన క్రికెట్ ఆడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన గెలిచిన క్రీడాకారులు క్రీడా స్పూర్తిని కొనసాగించాలని సిఐ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు నిర్వహించటం అభినందనీయమన్నారు.